బంపర్ ఆఫర్ : రూ. 2799లకే రెడ్‌మి నోట్‌ 6ప్రొ..

redmi-note6-pro-unbelievable-price-cut

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి సంచలన ప్రకటన చేసింది. షావోమి నుంచి వచ్చిన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 6 ప్రొ అతి తక్కువ ధర రూ.2799 లకే విక్రయిస్తున్నట్టు వెల్లడించింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి లభ్యం కానున్నట్టు చెప్పింది. ఈ మేరకు ఎంఐ ఇండియా ట్విటర్‌లో ట్వీట్ చేసింది. అయితే ఈ ఫోన్ ను పరిమితకాల ఆఫర్‌గా అందిస్తున్నట్టు పేర్కొంది. అలాగే కొన్ని కండిషన్స్ కూడా విధించింది. ఇప్పటికే హై5 పేరుతో తన స్మార్ట్‌ఫోన్లపై తగ్గింపు ధరలను ఆఫర్‌ చేస్తున్న షావోమి తాజాగా రెడ్‌మి 6పై భారీ తగ్గింపు ప్రకటించింది. ఇదిలావుంటే ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌ లో మాత్రం రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ధర రూ.13,999గా నే కనిపిస్తుండటం గమనార్హం.

https://platform.twitter.com/widgets.js