టీడీపీ, వైసీపీ కొట్లాట..ఒకరిపై ఒకరు దాడులు

TDP vs YCP

కృష్ణా జిల్లా జన్మభూమి సభల్లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దఓగిరాల, ఉయ్యూరు, మైలవరంలో ఇరువర్గాలు బాహాబాహీకి తలపడ్డాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కుర్చీలు విసురుకుని రణరంగంలా మార్చేశారు.

మైలవరం ఎంపీడీవో కార్యాలయం వద్ద జన్మభూమికి వైసీపీ కార్యకర్తలు కూడా వచ్చారు. అక్కడ అభివృద్ధి పనుల విషయంలో టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఇది కాస్తా చినికిచినికి గాలివానలా మారింది. అధికారులు ఇరువర్గాలకు సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చేసి వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు సాయశక్తులా ప్రయత్నించాల్సి వచ్చింది.

Recommended For You