సీఎం చంద్రబాబు ఇవాళ్టి షెడ్యూల్ ఇదే

today cm chandrababu naidu schedule

ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ నెల్లూరులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి నెల్లూరు చేరుకోనున్న సీఎం చంద్రబాబు… . చిప్పలేరు వాగు బకింగ్‌ హామ్‌ కాలువ మధ్య నిర్మించిన కొత్త బ్రిడ్జ్‌ను ప్రారంభిస్తారు. అనంతరం… బ్రిడ్జ్‌పై నుంచి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి శ్రీకారం చుడతారు. అనంతరం.. జువ్వలదిన్నెలో ఏర్పాటు చేసిన…. అమరజీవీ పొట్టిశ్రీరాములు విగ్రహాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ ప్రజల్నితో సీఎం చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు.

Also read : కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ

అనంతరం… బోగోలులో బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. జన్మభూమి మా ఊరు స్టాల్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం.. ఇక్కడ ప్రసగించనున్నారు. ఈ బహిరంగ సభ అనంతరం… నెల్లూరు ప్రజల కల అయిన దామవరం ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం… ఇక్కడ మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం బెజవాడ చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో.. అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో… అటు టీడీపీ నేతలు సైతం.. సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్న పట్టుదలతో ఉన్నారు.