సీపీఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి కన్నుమూత

veteran-communist-leader-narreddy-sivarami-reddy-passes-away

తొలితరం కమ్మూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు వారంరోజుల కిందట హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించారు. బ్రెయిన్‌ డెడ్‌కు గురికావడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మృతిచెందారు. రాష్ట్రంలోనే సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడుగా పేరొందిన శివరామిరెడ్డి పులివెందుల కమలాపురం ఉమ్మడి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు.

Also read : అయ్యో.. ఏం కష్టం వచ్చిందో ఏమో..

1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వస్థలం కడప జిల్లా కమలాపురం తాలూకు గడ్డం వారి పల్లె. స్వాతంత్య్ర సమరయోధుడిగా, కమ్యూనిస్టు నాయకులుగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. కాగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఆయన కూడా ఒకరు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. అలాగే అప్పట్లోనే రెండు ప్రముఖ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.