వైఎస్‌ జగన్‌ శ్రీవారి దర్శనం : భక్తులు తీవ్ర నిరసన

ys jagan visit tirumala and devoties fire on ycp fallowers

వైసీపీ అధ్యక్షుడు జగన్…. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన వైఎస్‌ జగన్………. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకొని… ‌ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. కాలినడకన…. 3 గంటల్లోనే కొండపైకి చేరుకున్న జగన్ వెంట …..పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

Also read : ఢిల్లీలో కాంగ్రెస్ కీలక మీటింగ్.. ఉత్తమ్ డుమ్మా

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వైఎస్‌ జగన్‌ తిరుమలలోని విశాఖ శారదా పీఠం చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ జగన్‌ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. గురువారం రాత్రి శారదాపీఠంలోనే
బస చేశారు. ఇవాళ ఇడుపులపాయకు వెళ్లనున్నారు..

అయితే…. వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతో శ్రీవారి ఆలయంలో గందరగోళం నెలకొంది. . పార్టీ కార్యకర్తలు లోపలికి దూసుకువెళ్లేందుకు యత్నించారు. టోకెన్స్ లేకుండా క్యూ కాంప్లెక్స్‌లోకి కార్యకర్తలు ప్రవేశించారు. దీంతో వైసీపీ కార్యకర్తలపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.