రోజూ చిటికెడు దాల్చిన చెక్కపొడి తీసుకుంటే..

వంటల్లో రుచి, సువాసన కోసం వాడే దాల్చిన చెక్క‌తో పలు అనారోగ్య సమస్యలన దూరం చేసుకోవచ్చు. చిన్న ముక్క దాల్చిన చెక్కను తీసుకుని దానికి ఓ రెండు చుక్కలు నీళ్లు కలిపి మెత్తగా నూరి నుదుటి మీద రాస్తే జలుబు వలన వచ్చే తలనొప్పి వెంటనే తగ్గుతుంది.

మధుమేహంతో బాధపడేవారికి కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది.

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఒక కప్పు నీటిలో మూడు టీస్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు టీస్పూన్ల తేనె కలిపి రోజుకు మూడు సార్లు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మంచి ఫలితం కనిపిస్తుంది.
దాల్చిన చెక్క నూనెను చెవిలో వేసుకున్నట్లయితే వినికిడి శక్తి పెరుగుతుంది. అదేవిధంగా చిటికెడు దాల్చిన చెక్క పొడిన పాలల్లో కలిపి రాత్రి పూట పడుకునే ముందు తాగితే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుందని ఆయుర్వేదం చెబుతుంది.


గుండె పట్టేసినట్లుగా అనిపిస్తే దాల్చిన చెక్క చూర్ణం, యాలకుల పొడి సమపాళ్లలో నీటిలో కలుపుకుని కషాయంలాగా కాచి తాగితే గుండె బిగపట్టడం తగ్గుతుంది. అలాగే దాల్చిన చెక్క కషాయం తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి.
4 స్పూన్ల తేనెను గోరు వెచ్చచేసి అందులో ఓ టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ మూడు పూటలా తీసుకోవాలి. ఇదే మిశ్రమాన్ని శరీరానికి పూసిన దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులనుంచి అరికట్టవచ్చు.
ఒక గ్లాసు బియ్యం కడిగిన నీటిలో 1 స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మహిళలను వేధించే అధిక రుతుస్రావం బారి నుంచి బయటపడవచ్చు.