జల్లికట్టులో అపశృతి..కానిస్టేబుల్‌ను లాక్కెళ్లిన ఎద్దు

jallikattu
jallikattu
  • చిత్తూరు జిల్లా కుప్పం మండలం జల్లికట్టులో అపశృతి
  • కానిస్టేబుల్‌ను లాక్కెళ్లిన ఎద్దు.. తీవ్రగాయాలు
  • జల్లికట్టును ఆపే క్రమంలో ఎద్దు తాడును కాలికింద అదిమిపట్టిన పోలీసు
  • భయంతో పరుగెత్తి… కానిస్టేబుల్‌ను లాక్కెళ్లిన ఎద్దు

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జరిగిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. జల్లికట్టు నిర్వహిస్తుండగా… పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్‌ ఎద్దుకున్న తాడును పట్టుకుని గ్రామస్తులతో మాట్లాడుతుండగా.. ఎద్దు ఒక్కసారిగా పరుగు అందుకుంది. తాడు కానిస్టేబుల్‌ కాలికి ముడిపడడంతో… ఎద్దు అతణ్ని కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌తో పాటు… ఆపేందుకు యత్నించిన 10 మంది గ్రామస్తులకు గాయాలయ్యాయి.