ఆ కేసులో వాళ్ళ జోక్యం ఎందుకు: చంద్రబాబు

cm chandrababunaidu comments on ycp and bjp
  • ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ
  • జగన్ కేసును ఎన్ఐఏకి అప్పగించటంపై నిరసన వ్యక్తం చేసిన సీఎం
  • ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం- చంద్రబాబు
  • రాష్ట్రాలను భయపెట్టేవిధంగా కేంద్రం వ్యవహరిస్తోంది
  • ఎన్ఐఏ దర్యాప్తుకి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • దేశ రక్షణ, ఉగ్రవాద చర్యల సమయంలో ఎన్ఐఏ దర్యాప్తుకి ఆదేశించాలని నిబంధనలు చెబుతున్నాయి
  • సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకొని ఇదివరకే వివిధ రాష్ట్రాల్లో ఎన్ఐఏ భంగపడింది

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. జగన్ పై దాడి కేసును NIAకి అప్పగించటంపై ప్రధానికి రాసిన లేఖలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాష్ట్రాలను భయపెట్టే విధంగా కేంద్రం వ్యహరిస్తోందన్నారు. జగన్ పై దాడి కేసును NIA దర్యాప్తు కి అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వ్యూలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణ, ఉగ్రవాద సంబంధిత కేసుల్లో మాత్రమే ఎన్ఐఏ దర్యాప్తు చేయాలనే నిబంధన ఉన్నదని బాబు తన లేఖలో గుర్తు చేశారు.