జగన్ పై దాడి కేసు విషయంలో ప్రధానికి సీఎం చంద్రబాబు లేఖ

cm chanadrababunaidu write a letter to pm modi over jagan case issue

ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. జగన్ పై దాడి కేసును NIAకి అప్పగించటంపై ప్రధానికి రాసిన లేఖలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రాష్ట్రాలను భయపెట్టే విధంగా కేంద్రం వ్యహరిస్తోందన్నారు. జగన్ పై దాడి కేసును NIA దర్యాప్తు కి అప్పగిస్తూ ఇచ్చిన ఉత్తర్వ్యూలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణ, ఉగ్రవాద సంబంధిత కేసుల్లో మాత్రమే ఎన్ఐఏ దర్యాప్తు చేయాలనే నిబంధన ఉన్నదని బాబు తన లేఖలో గుర్తు చేశారు.