అమరావతిలో మరో మణిహారానికి నాంది..

cm chandrababunaidu launched amaravathi iconic bridge

అమరావతిలో మరో మణిహారానికి నాంది పండింది. పవిత్ర సంగమం నుంచి రాజధానిని కలుపుతూ కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. కూచిపూడి నృత్య భంగిమలో ఐకానిక్ బ్రిడ్జిని రూపకల్పన చేయటం విశేషం. తక్కువ పిల్లర్లు ఎక్కువ కేబుల్స్ తో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం మరో ప్రత్యేక. దాదాపు 14 వందల కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థను సీఎం ఆదేశించారు.

అమరావతిని అడ్డుకునేందుకు కొందరు అడుగడుగునా ప్రయత్నించారని అన్నారు సీఎం చంద్రబాబునాయుడు. ఏపీ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా రాజధానిని నిర్మిస్తున్నామని అన్నారు. తనపై నమ్మకంతో రైతులు భూములు అప్పగించారని..ప్రజల కోసమే సంపదను సృష్టిస్తున్నానని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 వేల కోట్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయని అన్నారు.