కాంగ్రెస్‌ ఆశలు అడియాశలు.. టీడీపీ మినహా..

congress-on-akhilesh-yadav-mayawati-alliance-ignoring-us-dangerous

బీజేపీకి వ్యతిరేకంగా మాహాకూటమి ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్‌ ఆశలు అడియాశలు కానున్నాయి. తమతో కలివస్తాయని భావించిన ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతున్నాయి. యూపీలో తమతో కలిసి వస్తాయని భావించిన ప్రధానపార్టీలు ఎస్పీ, బిఎస్పీ కాంగ్రెస్‌ పార్టీకి హ్యాండిచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నాయి. కాంగ్రెస్‌ తో సీట్లు షేర్‌ చేసుకోవడానికి ఇరుపార్టీలు సిద్దంగా లేవు. మొత్తం 80 సీట్లలో చెరో 40 సీట్లులో పోటీచేయాలని నిర్ణయించాయి. ఉప ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసిపోటీచేసి విజయం సాధించాయి.. ఇదే ఫార్ములా కొనసాగించాలని నిర్ణయించారు.

Also read : హత్య కేసులో డేరా బాబాను దోషిగా తేల్చిన సీబీఐ

కూటమి సీట్ల పంపకంపై మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ కలిసి ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. ఇందులో కాంగ్రెస్‌ ఉంటుందా అన్న ప్రశ్నకు ….. ఆ పార్టీకి రెండు లోక్‌సభ సీట్లు మాత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అఖిలేష్‌ యాదవ్‌. అమేథి, రాయబరేలీ స్థానాలను ఇస్తామన్నారు. మోదీని ఎదుర్కొవాలంటే… ఎస్పీ,బీఎస్పీ కలసి పోటీ చేయాల్సిందేనన్నారాయన. మరోవైపు తాము ఏర్పాటు చేసే కూటమిలో కాంగ్రెస్‌ ఉండదని ఇప్పటికే మాయావతి స్పష్టం చేశారు. దీంతో.. ఈ రెండు పార్టీలు… కాంగ్రెస్‌కు దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది..

అటు బీహార్‌ లో సీట్లు పంపిణీ వ్యవహారంలోనూ ఆర్జేడీ- కాంగ్రెస్ మధ్య చిచ్చు రాజుకుంది. ఆర్జేడీ 10 సీట్లు మాత్రమే కాంగ్రెస్‌ కు ఇస్తామని ఆఫర్‌ చేసింది. అయితే 40 సీట్లలో 20 చోట్ల తాము గెలుస్తామని.. ఆర్జేడీ ఆఫర్‌ ను తిరస్కరించింది. దీంతో ఇరుపార్టీలు మధ్య పొత్తులు దాదాపు లేనట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

టీడీపీ మినహా కొత్తపార్టీలు ఎవరూ కాంగ్రెస్‌ తో జతకట్టేందుకు ముందుకు రావడం లేదు. ఒడిషాలో నవీన్‌ పట్నాయక్‌ ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు సమదూరం పాటిస్తామని ప్రకటించారు. అటు మమత బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఎన్నికల తర్వాత పరిస్థితులకు అనుగుణంగానే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాకూటమి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆచరణలోకి వస్తుందా అన్నదే సందేహం..

ఓ అడుగు వెనక్కి తగ్గి సీట్లు విషయంలో రాజీపడతానని గతంలో చెప్పిన కాంగ్రెస్‌ ఇప్పుడు దూకుడుగా వెళుతుంది. మూడు రాష్ట్రాల్లో విజయంతో సీట్లు విషయంలో రాజీపడకూడదని భావిస్తోంది. దీంతో.. పొత్తుల వ్యవహారం మరింత కఠినంగా మారినట్లు తెలుస్తోంది.