రివ్యూ: ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)..సినిమాలో వెంకీ మార్క్

F2-review
F2-review

వెంకటేష్ అనగానే గుర్తుకువచ్చే నాలుగైదు సినిమాలలో ప్రేక్షకులను నవ్వించినవే ఎక్కువ ఉంటాయి. అందుకే వెంకీ కి కామెడీ బ్రాండ్ ఇమేజ్ అయ్యింది. ఆ బ్రాండ్ ని వాడుకుంటూ అనిల్ రావిపూడి చేసిన ప్రయత్నమే ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ సంక్రాంతి అల్లుళ్ళుగా వెంకీ తో కలసి కామెడీ చేసేందుకు వరుణ్ తేజ్ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సినిమాలో ఫన్ ఎంటో ఫ్రస్టేషన్ ఏంటో చూద్దాం…

కథ :
వెంకీ( వెంకటేష్) ఒక ఎమ్యల్యే దగ్గర పిఎ గా పనిచేస్తుంటాడు. హారిక ( తమన్నా) తో మ్యారేజ్ అవుతుంది. పెళ్ళి అయిన కొత్తలో అంతా బాగానే అనిపించినా నెమ్మదిగా హారికా ఫ్యామిలీ చేస్తున్న డామినేషన్ తో వెంకీ కి ఫ్రెస్టేషన్ పెరుగుతంది. హారికా చెల్లెలు హానీ (మెహరీన్) వరుణ్ (వరుణ్ తేజ్ )తో లవ్ లో పడటం, వారిద్దరిని వెంకీ రెడ్ హ్యాండెడ్ గా పట్టిచ్చే క్రమంలో వారికీ ఎంగేజ్ మెంట్ ఫిక్స్ అవుతుంది. వెంకీ కి తొడుగా వచ్చిన వరుణ్ కూడా అదే డామినేషన్ కి ఫ్రస్టేట్ అవుతూ ఉంటాడు. వీరి ఫ్రస్టేషన్ పీక్స్ లోకి వెళ్ళి వీళ్ళిద్దరూ ఎవరికీ చెప్పకుండా యూరప్ వెళ్ళిపోతారు. భార్యను వదిలేసి వెంకీ, పెళ్ళి కాన్సిల్ చేసుకొని వరుణ్ తీసుకున్న నిర్ణయం వీరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పింది అనేది మిగిలిన కథ

కథనం:
సంక్రాంతి అంటేనే సరదాలు, సంతోషాలు వాటిని కాస్త ఎక్కవు చేయడానికి సంక్రాంతి అల్లుళ్ళు బాగా నవ్వులను మూటగట్టుకొని వచ్చారు. వెంకీ నుండి ఈ మద్య మిస్ అవుతున్న వినోదం అంతా కుప్పగా పోసాడు దర్శకుడు . రెగ్యులర్ గా రోజు వారి జీవితాలలో కనిపించే సన్నివేశాలతో టాప్ క్లాస్ వినోదం అందించాడు. వెంకీ ఇంట్రడక్షన్ సీన్ నుండి అనిల్ రావిపూడి స్ట్రిక్ట్ గా వినోదానికి ఫిక్స్ అయ్యాడు. అందుకే జంధ్యాల సినిమాలలో కనిపించే క్యారెక్టర్స్ తో నవ్వులను పంచాడు. రఘబాబు, అతని గన్ మాన్ గా రేడియో మిర్చి కిరణ్ లతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాడు దర్శకుడు. పెళ్ళయిన కొత్తలో నెత్తిన పెట్టుకున్న భర్తల పరిస్థితి తర్వాత ఎలా వెంకీ క్యారెక్టర్ లో వస్తున్న మార్పులతో ఫుల్ పన్ గా మార్చాడు. తెలివైన పెళ్ళాలతో సగటు మగాడు పడే పాట్లు కడుపుబ్బ నవ్విస్తాయి. ఇక వెంకీ ఆసనం ఈ టోటల్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలుస్తుంది. వరుణ్ తేజ్ కూడా తెలంగాణా యాస లో బాగా ఫన్ క్రియేట్ చేసాడు. తమన్నా హారికా పాత్రలో మెప్పించింది. తమన్నా కంటే మెహ్రిన్ రోల్ డిఫరెంట్ గా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ తో దర్శకుడు చేయించిన కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇక కాలేజ్ కల్చరర్ ప్రొగ్రాం సీన్ అందులో హైలెట్ గా నిలుస్తుంది. ఆ సీన్ ని ఛమ్మక్ చంద్ర మరింత రక్తి కట్టించాడు. సినిమా లో క్యారెక్టర్ లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ మారుతున్నా ప్రేక్షకులకు మాత్రం ఎక్కడా ఫన్ మిస్ అవ్వకుండా దర్శకుడు కథను నడిపాడు. ఇక సెంకాఫ్ కొచ్చే సరికి కథ లో ఎలివేట్ చేసిన పాయింట్ ఛాలెంజ్ మోడ్ లోకి టర్న్ అయి కథనం కాస్త రోటీన్ గా మారింది. వెంకీ, వరుణ్ ల మద్య కాంబినేషన్ కి ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ యాడ్ అయి చేసిన కామెడీ సరదాగా ఉంది. తమ పెళ్ళాలను సాధించాలని పారిపోయిన మగాళ్లు వాళ్ళను దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నం కొత్త గా అనిపించకపోయినా ఫన్ మిస్ అవ్వకుండా దర్శకుడు జాగ్రర్త పడ్డాడు. మొదటి భాగం తో పోల్చితే రెండవ భాగంలో ఎంటర్ టైన్మెంట్ పాళ్ళు తగ్గాయి. అన్ని క్యారెక్టర్స్ తో కామెడీ చేయించాలని దర్శకుడు గట్టిగా ఫిక్స్ అయ్యాడు కాబట్టి లాజిక్ లు కనిపించవు. వెంకీ లోని ఎంటర్ టైనర్ ని పుల్ లెంగ్త్ లో వాడుకున్నాడు. గిరా గిరా, మస్త్ గుంది బ్రదర్ పాటలు సరదాగా ఉన్నాయి. సెకండాఫ్ లో రోటీన్ క్లాస్ లతో టైం పాస్ చేసిన దర్శకుడు రోటీన్ ఎండింగ్ కి ఫన్ ని యాడ్ చేయడంలో సక్సస్ అయ్యాడు.
ఈ సంక్రాంతికి సరదా నవ్వులతో కాసేపు ఇంటిల్లపాది నవ్వించడంలో సంక్రాంతి అల్లుళ్ళు సక్సెస్ అయ్యారు.

చివరిగా:
ఫన్ రైడ్