ఖాళీ అయిపోతోన్న హైదరాబాద్

Hyderabad City Roads Deserted With Effect Of Sankranti Festival

సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు సిద్ధమయ్యారు పట్నం వాసులు… కుటుంబ సభ్యులతో కలిసి పల్లెల్లో పండుగ జరుపుకోవడానికి క్యూ కట్టారు… సంక్రాంతి అంటేనే హైదరాబాద్‌ సిటీ ఖాళీ అయిపోతుంది. విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు రెండవ శనివారం, ఆదివారం రావడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు సంక్రాంతి పండుగకు కలిసి వచ్చాయి.

Also read : నేడు రెండు కీలక మైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. హైవేపై వాహనాల జాతర క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రోజువారి కంటే 15 నుంచి 20 శాతం వాహనాలు పెరిగినట్లు సమాచారం. పంతంగి టోల్ వద్ద వాహనాలు బారులుతీరుతున్నాయి. జాతీయ రహదారిపై ప్రత్యేక తనిఖీల కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను తొలగించి రాకపోకలకు సుగమం చేశారు. హైవే వెంట పోలీసు బందోబస్తు పెంచారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు వెళ్లే టోల్ గేట్ల సంఖ్యను పెంచారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసారు. టోల్ వద్ద వాహనాలు బారులుతీరకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రజలు పల్లెల్లో సంక్రాంతి పండుగ పూర్తి చేసుకోని భాగ్యనగరం చేరుకునే వరకు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పోలీస్ శాఖ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.

సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నుంచి ఏపీకి నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు హైదరాబాదీలు క్యూ కడ్తుంటారు. ప్రస్తుతం వాహనాల తాకిడి హైదరాబాద్‌ విజయవాడ ప్రధాన రహదారిపై పెరిగింది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈజీ ట్రాఫిక్‌ ఫ్లో ఉండేలా అదనపు సిబ్బందిని మోహరించారు.

మరోవైపు పండక్కి ఊరెళ్దామని ఇప్పుడు టికెట్లు బుక్‌ చేసుకుంటున్న వారికి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ షాకిస్తున్నాయి. టికెట్‌ ధరలను అమాంతం పెంచేశాయి. రైళ్లలో టికెట్లు దొరకడం లేదు. అన్ని ట్రైన్స్‌‌లో వెయిటింగ్‌ లిస్ట్‌ వస్తోంది. రైల్వే స్టేషన్లలో రద్దీపై పెరిగిపోయింది… ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ప్రయాణికులను దోచుకునేందుకు ఊరించే ఆఫర్లతో చీటింగ్‌ చేస్తున్నాయి. సంక్రాంతి రద్దీ అంటే విజయవాడ వెళ్లే రహదారి జామ్‌ కావాల్సిందే. కారెనకారు అన్నట్టు ట్రాఫిక్‌ నత్తనడకను తలపిస్తుంది. ఎల్బీనగర్‌ దగ్గర స్లోగా సాగుతున్న ట్రాఫిక్‌ రాత్రి 9 గంటలకు పూర్తిగా జామ్‌ అవుతోంది.