నన్నెందుకు దూరం పెడుతుంది : మంత్రి అఖిల ప్రియ

iam not leav tdp minister akhilapriya says

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి భూమా అఖిలప్రియ పార్టీ మారుతానే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె జనసేనలోకి వెళ్తున్నారంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అదే సమయంలో.. వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిపై స్పందించారు మంత్రి అఖిల ప్రియ. తన చెల్లెల్ని కూడా తీసుకొని జనసేనలోకి వెళ్తున్నానని ఓ ఛానల్‌లో ప్రచారం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబం టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారామె.

Also read : 2019 ఎలక్షన్ బ్యాండ్ మోగించిన బీజేపీ

అసలు టీడీపీ తననెందుకు దూరం పెడుతుందని ప్రశ్నించారు అఖిల ప్రియ. పార్టీకి, తనకు మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. తాము పార్టీ మారతామంటూ రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయన్నారు. భూమా కుటుంబం రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది తెలుగుదేశంలోనేనని, ప్రాణం ఉన్నంతవరకు ఆ పార్టీలోనే కొనసాగుతామన్నారు. కొందరు పనిగట్టుకుని తమ కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు వల్లే ఆళ్లగడ్డకు నీళ్లు వచ్చాయన్నారామె. 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డలో మరోసారి గెలిచి అధినేత చంద్రబాబునాయుడికి కానుకగా ఇస్తామన్నారు అఖిలప్రియ.