కోదండరాం సంచలన ఆరోపణలు

kodandaram
  • ఈసీ చీఫ్ రజత్ కుమార్ పై కోదండరాం సంచలన ఆరోపణలు
  • ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఆరోపణ
  • రజత్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్
  • ఎన్నికల నిర్వహణపై కూడా విచారణకు డిమాండ్
  • రజత్ కుమార్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న కోదండరాం
  • ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయటంపై ఆసక్తి లేదన్నకోదండరాం
  • కాంగ్రెస్ నిర్ణయం ఆధారంగానే కూటమిలో కొనసాగటంపై నిర్ణయం
  • పంచాయితీ ఎన్నికల తర్వాత భూ పట్టాలు, పోడు భూములపై పోరాటం

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఈసీపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారాయన. ఎన్నికల నిర్వహణ తీరు… ఈసీ రజత్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలనే ఆసక్తి తనకు లేదన్నారు కోదండరాం. పంచాయితీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమిలో కొనసాగాల వాద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయం అధారంగానే ఉంటుందన్నారు. భూమి పట్టాలు, పోడు భూములపై పంచాయితీ ఎన్నికల తర్వాత పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు కోదండరాం.