చనిపోయిన వ్యక్తిని ట్రాన్స్‌ఫర్‌ చేసిన పోలీస్ బాస్‌లు

UP-DGP
UP-DGP

ప్రతి విషయంలో ప్రభుత్వ అధికారుల అలసత్వం బయటపడుతునే ఉంది. తాజాగా యూపీలో చనిపోయిన వ్యక్తికి ట్రాన్సఫర్‌ ఆర్డర్‌ ఇచ్చి అందరిన్నీ ఆశ్చర్యపరిచారు.
డీఎస్పీగా పని చేసున్న సత్య నారాయణ సింగ్‌ అనే వ్యక్తి నెల రోజుల క్రితం మరణించాడు. బదిలీలు జరపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు ట్రాన్స్‌ఫర్‌ లిస్ట్‌ తయారు చేశారు. అధికారులు పోరపాటున మరణించిన సత్య నారాయణ సింగ్‌ పేరును ట్రాన్స్‌పర్ లిస్ట్‌లో జతచేశారు. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో యూపీ డీజీపీ ట్విటర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు.

“పొరపాటున ట్రాన్సఫర్‌ లిస్ట్‌లో సత్యనారాయణ పేరును చేర్చాము. దీనికి మేము చింతిస్తున్నాము. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెప్తున్నాను. ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం. ఇందుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం” అంటూ డీజీపీ ట్వీట్‌ చేశారు.

https://platform.twitter.com/widgets.js