ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ కలెక్షన్స్

ntr-kathanayakudu-box-office-collection-day-3-balakrishna-film

సంక్రాంతి కానుకగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ (కథానాయకుడు) పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితాన్ని తెర మీద ఆవిష్కరించిన ఈ చిత్రంపై అన్నివర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తునారు. ఎన్టీఆర్ పాత్రను పోషించిన ఆయన తనయుడు బాలకృష్ణకు బ్రహ్మరధం పట్టారు. పెద్దాయన ఎన్టీఆర్ ను బాలయ్య రూపంలో చూసుకున్న అభిమానులు.. ఈ సంక్రాంతికి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు కథానాయకుడు బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇండియాతోపాటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం తొలి రోజు మంచి వసూళ్లనే రాబట్టినట్టు తెలుస్తోంది.

Also read : అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో హిందూ మ‌హిళ‌..

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో 50 కోట్ల మార్కును దాటినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక ఆంధ్రాలో అత్యధికంగా గుంటూరులో రూ.2.14 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.63 లక్షలు, నెల్లూరులో రూ.56 లక్షలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం

రెండో రోజు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.23.2 లక్షలు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. శనివారం నుంచి ఈ సినిమా వసూళ్లు మరింత ఊపందుకున్నాయి. వీకెండ్‌తోపాటు సంక్రాంతి కలిసి రావడం.. ‘ఎన్టీఆర్’కు కలిసి వచ్చిన అంశం.