బుల్లెట్ల వర్షం,కాల్పుల హోరు..ఏం జరుగుతోందో తెలుసుకునేలోపు..

Octopus mock drill
Octopus mock drill

వరంగల్‌లో అత్యంత రద్దీ ప్రాంతం. వందల మంది ప్రజలు కూడలి వద్ద రాకపోకలు సాగిస్తున్నారు. ఇంతలో కలకలం. కాల్పుల హోరు. ఏం జరిగిందో, ఏం జరుగుతోందో తెలుసుకునేలోపు ఓ కారుపై బుల్లెట్ల వర్షం కురిసింది.

వరంగల్‌లో ఉగ్రవాదులు పడ్డారు. వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కారుపై కాల్పులు జరిపి ఉగ్రవాదుల పని పట్టారు. ఒకడు పారిపోతుంటే.. పోలీస్ జాగిలం తన టాలెంట్‌తో పట్టుకుంది.

సీన్ కట్‌ చేస్తే.. ఇదంతా మాక్‌డ్రిల్‌గా తేలింది. ఆక్టోపస్‌ పోలీసులు ఈ డ్రిల్‌ చేపట్టారు. ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో చైతన్య పరిచేందుకు ప్రయత్నించారు. తాము అప్రమత్తంగా ఉన్నామంటూ ఓరుగల్లు ప్రజలకు భరోసా ఇచ్చారు.