ఈబీసీ రిజర్వేషన్లకు రాష్ట్రపతి ఆమోదం.. కేంద్రం నుంచి..

Ramnath Kovind

దేశ చరిత్రలోనే అరుదైన రికార్డ్. కేవలం వారం రోజుల వ్యవధిలో అత్యంత కీలకమైన చట్టం రెడీ అయ్యింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ ను కల్పిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. ముందుగా లోక్ సభలో ఈ బిల్లు నెగ్గింది. రాజ్యసభ కూడా 2/3వ వంతు మెజార్టీతో దీనిని ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. రిజర్వేషన్లపై గెజిట్ ను కూడా కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. ఈ కింది అంశాల ఆధారంగా రిజర్వేషన్ కల్పిస్తారు,

  • రూ.8 లక్షల కన్నా ఆదాయం తక్కువగా ఉన్నవారు
  • 5 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి, 1000 అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లున్నవారు
  • నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతాల్లో 100 గజాల కన్నా తక్కువ జాగాలో ఇల్లున్నవారు
  • నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ప్రాంతంలో 200 గజాల కన్నా తక్కువ జాగాలో ఇల్లున్నవారు
  • ఈ రిజర్వేషన్ల వల్ల బ్రాహ్మణులు, రాజ్ పుట్ లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్ లు, వైశ్య, కమ్మ,, కాపు, రెడ్డి, క్షత్రియతో పాటు మరికొన్ని సామాజికవర్గాలకు మేలు చేకూరనుంది.