అందుకే సంచలన నిర్ణయం తీసుకున్న ఆలోక్‌ వర్మ

reason behind alok verma resined

కేంద్ర దర్యాప్తు సంస్థ మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో బుధవారం మరోసారి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ను మళ్లీ తప్పిస్తూ కేంద్రం గురువారం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఆయన్ను ఫైర్‌ సర్వీసెస్‌ డీజీగా బదిలీ చేసింది. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన అలోక్‌ శర్మ… అగ్నిమాపక డీజీ బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Also read : కాంగ్రెస్‌ ఆశలు అడియాశలు.. టీడీపీ మినహా..

సీబీఐలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్ ఆస్థానాకు, ఆలోక్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇది సీబీఐ పరువు తీసేవిధంగా ఉందని భావించిన కేంద్రం…వీరిద్దరిని బలవంతంగా సెలవుపై పంపించింది. సీబీఐలోనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం. నాగేశ్వరారవును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది..

తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అన్యాయంగా పదవి నుంచి తప్పించారంటూ …ఆలోక్ వర్మ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆయన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు…. దీనిపై సీవీసీని నివేదిక కోరింది. సీవీసీ రిపోర్ట్‌ అనంతరం…. స్పందించిన కోర్టు…అర్ధరాత్రి పూట నిర్ణయాలు తగవంటూ కేంద్రాన్ని హెచ్చరించింది. దీంతో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిక్రీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ దీనిపై సుదీర్ఘంగా చర్చించాక కీలక నిర్ణయం తీసుకుంది. ఆలోక్‌ను మరోసారి డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో అలోక్‌ మనస్తాపానికి గురయ్యారు. ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలిచేశారనే ఉద్దేశంతో ఆయన అగ్నిమాపక డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. అటు ఆలోక్‌వర్మ‌ ఇటీవల ఏడుగురు సీబీఐ అధికారులను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొత్త డైరెక్టర్‌ నాగేశ్వరరావు రద్దుచేశారు. వీరిని తిరిగి వారివారి స్థానాల్లో కొనసాగాంచారు. ఈ పరిణామాల నేపథ్యంలో….ఆలోక్‌ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు… అదనపు డైరెకర్ట్ ఎం.నాగేశ్వరరావు కొత్త చీఫ్‌గా శుక్రవారం పగ్గాలు చేపట్టారు.