ఆర్టీసీ బస్సు బీభత్సం

RTC-BUS-accident
RTC-BUS-accident

సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
రైల్వే స్టేషన్‌ సమీపంలో పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు
ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
క్షతగాత్రులు ఆస్పత్రికి తరలింపు
బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ప్రమాదం
రెండు కార్లు, రెండు ఆటోలు, బైక్‌ ధ్వంసం
బస్సు డ్రైవర్‌ అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రైల్వే స్టేషన్‌ సమీపంలో బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు బ్రేకులు విఫలం కావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.