ఊహించని పరిణామం.. కాంగ్రెస్‌కు షాక్

H-D-Kumaraswamy-with-Congre
H-D-Kumaraswamy-with-Congre

దేశ రాజకీయాల్లో సరికొత్త పరిణాం చోటుచేసుకుంది. కొంతకాలంగా యూపీలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసిపోటీచేయాలని నిర్ణయించారు. మాయావతి, అఖిలేష్ యాదవ్ సంయుక్తంగా ప్రకటన చేశారు. తమ పొత్తు చారిత్రక అవసరమని మాయావతి అభిప్రాయపడ్డారు. తమకు పొత్తులు కొత్తకాదని.. 1993లో కలిసి పోటీచేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశ విసృత ప్రయోజనాల దృష్ట్యా తమ కలయిక అవసరమని భావించి పొత్తులు పెట్టుకున్నట్టు తెలిపారు.

ఎస్పీ-బిఎస్పీ పొత్తు బీజేపీకి నిద్ర దూరం చేస్తున్నారు మాయావతి. ఇరుపార్టీల మధ్య ఐక్యత రాకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారని అయినా.. రాష్ట్రంలోని పేదల కోసం తాము పాత వైరాన్ని మరిచి పొత్తులకు సిద్దమయ్యామన్నారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో దేశ ప్రజలు సంతోషంగా లేరని.. అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. రైతులు, కూలీలు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు కూడా మోడీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు.దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల కోసం తాము కలిసిపనిచేయాలని నిర్ణయించామన్నారు.

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టత ఇచ్చారు మాయావతి, అఖిలేష్. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. పైగా యూపీలో పార్టీకి బలం లేదన్నారు. మొత్తం సీట్లలో చెరి 40 సీట్లలో పోటీచేస్తామన్నారు. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరగలేదని అఖిలేష్ అన్నారు. అసలు ఆలోచనే లేదన్నారు. ఎస్పీ-బిఎస్పీ కలిసి మాత్రమే పోటీచేస్తాయన్నారు. బలం లేని కాంగ్రెస్ పార్టీని తమతో కలుపుకోవడం ఇష్టం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తేడా లేదని మాయావతి అన్నారు.