శ్రీశైలంలో అన్యమత వేడుకలు..ఏఈవో సస్పెన్షన్‌

srisailam-temple

శ్రీశైలం దేవస్థానంలో AEOగా విధులు నిర్వహిస్తున్న మోహన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. గత డిసెంబర్‌ 25న శ్రీశైల క్షేత్రంలోని గంగాసదన్‌పై అన్యమత వేడుకలు నిర్వహించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వాటిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషర్ ఆధ్వర్యంలో విచారణ జరపగా.. నిజమని తేలింది. దీంతో.. కమిషనర్‌ ఆదేశాల మేరకు AEO మోహన్‌ను సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.