నేడు రెండు కీలక మైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

Tallest pylon to adorn iconic bridge in Vijayawada

అమరావతికి ,సంబందించి రెండు కీలక మైన ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో విజయవాడ- హైదరాబాద్‌ నేషనల్‌ హైవేని అమరావతి అనుసంధానిస్తూ.. కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెన మొదటిది. ఇక రెండోది తాగునీటి అవరాలకు చేపడతున్న నీటి శుద్ధి ప్లాంట్‌. ఉదయం 10 గంటలకు ఇబ్రహీం పట్నం సమీపంలోని పవిత్ర సంగమమం వద్ద వీటికి శంకుస్థానప చేయనున్నారు.

Also read : అప్పటినుంచే గోదావరి జిల్లాల్లో కత్తులు నూరడం ప్రారంభమవుతుంది

ఇబ్రహీంపట్నం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై 1387 కోట్లతో 3.2 కి.మీ పొడవైన ఐకానిక్‌ వంతెనను నిర్మిస్తున్నారు. దీని మధ్యలో దాదాపు అర కిలోమీటర్‌ భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. ఈ భాగంలో యోగ భంగిమతో పైలాన్‌ ఉంటుంది. దీనిని వంతెనతో అనుసంధానిస్చతూ.. రెండు పక్కల తీగలా అమరిక ఉంటుంది. ఈ పైలాన్‌ ఎత్తు 170 మీటర్లు. ఆరు లేన్లలో ఈ వంతెనను నిర్మసి్తున్నారు. రెండు వైపుల నడక దారి ఉంటుంది.

రాత్రి సమయాల్లో అత్యంత ఆందంగా కనిపించేందులా విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. ఇవి కాలాలకు అనుగుణంగా వేర్వేరు రంగులు వెదజల్లుతాయి. దీని నిర్మాణ గడువు రెండేళ్లు. ఎల్‌అండ్‌ టీ సంస్థ ఈ పనులు దక్కించుకుంది. శంకుస్థాపన పూర్తైన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.