బరితెగించిన ఎమ్మార్వో… ఏకంగా 500 ఎకరాలను..

mro-fraud
mro-fraud

ప్రకాశం జిల్లా తర్లుపాడు ఎమ్మార్వో బరితెగించిపోయారు. ఏకంగా 500 ఎకరాల ప్రభుత్వ భూమిని 150 మంది పేరు మీద ఆన్ లైన్ చేసి కోట్లు కొల్లగొట్టాడు. చేయాల్సిన అక్రమాలన్ని చేసి లాంగ్ లీవ్ లో అమెరికా చెక్కేశాడు. ఈ కోట్ల కుంభకోణాన్ని కేవలం ఐదు రోజుల్లో పూర్తి చేశాడు. వీఆర్వో, ఆర్ఐల ప్రొసీడింగ్స్ లేవు..రైతులు ఎలాంటి ఆర్జీలు పెట్టుకోలేదు. కానీ, 500 ఎకరాల ప్రభుత్వ భూమి, దేవునిమాన్యాలు, పశువుల బీళ్లు గుట్టు చప్పుడు కాకుండా ఆ 150 మంది పేరు మీదికి ఆన్ లైన్ అయ్యాయి.

తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు, మంగళకుంట, కులుజువ్వలపాడు, లక్షక్కపల్లి, నాగెళ్లముడుపు గ్రామాల్లోని ప్రభుత్వ భూములన్ని ఎమ్మార్వో అక్రమానికి ప్రైవేట్ పరం అయ్యాయి. ఎకరానికి 20 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేశాడతను. ఊరికో దళారినికి పెట్టుకొని మరీ డబ్బులు వసూలు చేశాడు. మర్కాపురం మండలానికి చెందిన ఓ వీఆర్వోతో పాటు మరో ఇద్దరు ఆర్ఐల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. వంశపారపర్యంగా వచ్చిన భూములు అంటూ ఆయా వ్యక్తుల పేరు మీద ఆన్ లైన్ చేసిన ఎమ్మార్వో..డీల్ డబ్బులు ముట్టగానే ఆఫీస్ నుంచి నేరుగా ఎయిర్ పోర్ట్ వెళ్లాడు.