అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో హిందూ మ‌హిళ‌..

tulsi-gabbard-announces-2020-presidential-run-to-take-on-trump

2020 లో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి హిందూ మ‌తానికి చెందిన అమెరికా ఎంపీ తుల‌సీ గ‌బ్బార్డ్ పోటీపడుతున్నారు. ఈ మేరకు తుల‌సీ గ‌బ్బార్డ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. పోటీకి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆమె చెప్పారు. కాగా డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన తుల‌సి వ‌య‌సు 37 ఏళ్లు. చిన్న‌త‌నంలోనే గ‌బ్బార్డ్ హిందూ మ‌తాన్ని స్వీక‌రించారు. భార‌త సంత‌తికి చెందిన సుమారు 12 మంది 2020లో ట్రంప్‌కు పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు.

Also read : పండగ సీజన్‌.. బస్సు చార్జీలు చూస్తే..

వీరిలో తులసి కూడా ఉన్నారు. దాంతో డెమోక్ర‌టిక్ పార్టీ నుంచి అధ్య‌క్ష రేసుకు పోటీలో ఉన్న రెండ‌వ మ‌హిళ‌గా ఆమె నిలిచారు. సేనేట‌ర్ ఎలిజ‌బెత్ వారెన్ కూడా వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాలనీ ఆమె నిర్ణయించుకున్నారు. తుల‌సీ గ‌బ్బార్డ్ నాలుగుసార్లు హ‌వాయి నుంచి హౌజ్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌కు ఎంపిక‌య్యారు. ఇరాక్ యుద్ధంలో ప‌నిచేసిన ఆమె.. తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. తులసి గనక అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నికైతే మొద‌టి క్రైస్త‌వేత‌ర వ్య‌క్తిగా నిల‌వ‌నున్నారు.