చంద్రబాబు నిర్ణయంతో గ్రామాల్లో రెండ్రోజుల ముందే సంక్రాంతి

twodays before coming sankranthi festival in andhrparadesh over cm chandrababunaidu decision

ఏపీలో పండుగ వాతావరణం నెలకొంది… నెల్లూరు జన్మభూమిలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం వెల్లివిరుస్తోంది… అనంతపురంలో పెన్షన్‌ లబ్దిదారులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు… చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు… మళ్లీ చంద్రబాబే సీఎం కావాలని కోరుకున్నారు…

Also read : ఖాళీ అయిపోతోన్న హైదరాబాద్

అటు విజయవాడ పడమట ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర తెలుగు యువత అధ్వర్యంలో చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా..ప్రజల సంక్షేమం విషయంలో చంద్రబాబు చూపిస్తున్న సాహసాన్ని మరువలేమన్నారు.

పెన్షన్లు రెట్టింపు చేయడంతో పాటు.. రైతులకు నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతిలో రైతులు, వృద్దులు ఆనందం వ్యక్తం చేశారు…

చంద్రబాబు ఇంటికే కాదు రాష్ట్రానికే పెద్ద కొడుకు అని హర్షం వ్యక్తం చేస్తున్నారు కర్నూలు ప్రజలు. మళ్లీ సీఎంగా అధికారంలోకి చంద్రబాబు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పింఛన్లు రెట్టింపు చేయడంతో పలు చోట్ల చంద్రబాబు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

పెన్షన్‌ను రెట్టింపు చేయడంపట్ల గుంటూరులో వృద్ధులు సంబరపడిపోతున్నారు… వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ గెలిపిస్తామని కరాఖండిగా చెబుతున్నారు… మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంతో గ్రామాల్లో రెండ్రోజుల ముందే సంక్రాంతి పండుగ చేసుకుంటున్నారు ప్రజలు.