సంక్రాంతికి కురిసిన హాస్యపు జల్లు: ‘F2’ మూవీ రివ్యూ

సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చిన F2 ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచింది. F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంటూ కామెడీ పండించారు వెంకటేష్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.

వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ నటించారు. బిజీలైఫ్‌లో కాస్త రిలాక్సేషన్ కోసం సినిమాకి వెళ్లే వాళ్లకి వెంకటేష్, వరుణ్ కామెడీ మంచి రిలీఫ్‌ని ఇచ్చిందని ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫస్టాఫ్ మొత్తం ఫుల్ ఫన్ అంటూ కడుపు చెక్కలయ్యేలా కామెడీ పండిస్తే.. సెకండాఫ్‌లో ఫన్‌కి ఫ్రస్ట్రేషన్ కూడా జత చేసి కడుపుబ్బా నవ్వించారని తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

హారిక, హనీ సిస్టర్స్‌గా తమన్నా, మెహ్రీన్‌లు వెంకీ, వరుణ్‌లకు చుక్కలు చూపించారంటున్నారు. మొత్తానికి F2 చిత్రం నవ్వులతో నిండిన భార్యా బాధితుల కథగా సంక్రాంతికి సందడి చేసిందని అంటున్నారు.

https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js https://platform.twitter.com/widgets.js