14నెలల సుదీర్ఘ విరామం తర్వాత..

  • కడపజిల్లా పులివెందులకు చేరుకున్న వైసీపీ అదినేత వై.ఎస్‌.జగన్మోహనరెడ్డి
  • వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జగన్‌కు ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు
  • ఆర్టీసీ బస్‌స్టాండ్‌ నుంచి స్థానిక సిఎస్‌ఐ చర్చి వరకు జగన్‌తో కలసి భారీ ర్యాలీ నిర్వహించిన వైసీపీ శ్రేణులు
  • తన కుటుంబ సభ్యులతో కలసి సిఎస్‌ఐ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న జగన్‌

వైఎస్సార్‌సీపీ అదినేత జగన్‌ 14నెలల సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర అనంతరం కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పులివెందుల ఆర్టీసీ బస్‌ స్టాండ్‌ వద్ద వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జగన్‌కు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆర్టీసీ బస్‌స్టాండ్‌ నుంచి అంగళ్ల సర్కిల్‌ మీదుగా సిఎస్‌ఐ చర్చ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం.. సిఎస్‌ఐ చర్చిలో జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. దేవుడి దయ వల్ల 14 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలు తెలుసుకోగలిగానని జగన్‌ అన్నారు.