సంక్రాంతికి హ్యాపీగా ఎంజాయ్‌ చేయాలనుకున్నారు..కానీ..

festive-rush-hour
festive-rush-hour

సంక్రాంతి పండగను హ్యాపీగా ఎంజాయ్‌ చేయాలనుకున్న ప్రజలకు అవస్థలు తప్ప లేదు. ముఖ్యంగా పట్టణాల నుంచి పల్లెకు పోదాం అనుకునే వారంతా సరిపడ రవాణా సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు టోల్‌ ప్లాజాలు సైతం ఏడిపిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు కనిపిస్తున్నాయి.

సంక్రాంతి పండుగను సరదగా గడపాలి అనుకునే ప్రజలకు ప్రయాణం నరకమవుతోంది. ట్రైన్‌లో వెళ్దామంటే రిజర్వేషన్లు లేవు.. పోనీ జనరల్‌ టికెట్‌ తీసుకొని వెళ్లాలనుకున్నా.. కాలు పెట్టే అవకాశం కనిపించడం లేదు. రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తే వేలల్లో టికెట్లు వసూలు చేస్తున్నారు. అయినా ట్రైన్లు, బస్సులు అన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇక చేసేది లేక కొంతమంది కార్లను.. అద్దె వాహనాలను ఆశ్రయిస్తున్నారు.. దీంతో ఏపీ వైపు వెళ్లే రహదారులన్నీ రద్దీగా మారాయి.