బోర్ కొట్టిందని ఇళ్లకు నిప్పు.. తనే సమాచారం అందించి..

fire-fighter-set-fire-houses-due-bore-feeling-mumbai

ఎవరైనా బోర్ కొడితే ఏం చేస్తారు..? టీవీ చూస్తారు లేదంటే స్నేహితులతో గడుపుతారు. ఇంకా వారి ఇష్టాలను బట్టి ఏదో ఒక వ్యాపకాన్ని క్రియేట్ చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇందుకు బిన్నంగా ప్రవర్తించాడు. బోర్ కొట్టిందని ఇళ్లకు నిప్పు పెట్టాడు. వినడానికే విసుగు తెప్పించే ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైకి చెందిన ర్యాన్‌ లుభం (19) డిగ్రీ చదువుతున్నాడు. వాలంటీర్‌ ఫైర్‌ఫైటర్‌ గా పార్ట్ టైం పనిచేస్తున్నాడు. ఇటీవల ఏ పని లేక ఖాళీగా ఉన్నాడు. దాంతో అతగాడికి బోర్ కొట్టిందట.. టైం పాస్ కోసం పక్కనున్న కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టడం ప్రారంభించాడు. ఇలా రోజు చేస్తున్నాడు. నిప్పుపెట్టడమే కాక అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి వారితో కలిసి మంటలు ఆర్పుతాడు. కానీ ఈ పనికి పాల్పడుతోంది అతనేననే అనుమానం ఎవ్వరికి రాలేదు.

Also read : ఆయనపై గుర్రుగా ఉన్నఇద్దరు నేతలు

ఈ క్రమంలో స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ అకృత్యానికి పాల్పడుతోంది ర్యాన్‌ అని గుర్తించారు. గత నెల ముంబైలోని ఆగ్నేయా పిట్స్‌బర్గ్‌లో ర్యాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో డిసెంబర్‌ 3, 10 తేదీల్లో స్థానికంగా ఉన్న ఇళ్లకు నిప్పంటించినట్టు అతడు ఒప్పుకున్నాడు. ఎందుకలా చేస్తున్నావని పోలీసులు అతన్ని ప్రశ్నించగా.. నిప్పంటించడం నాకు సరదా, రోజు బోర్ కొట్టి ఇలా చేస్తున్నాను.. అందులో ఆనందం ఉందని చెప్పాడు. దాంతో పోలీసులు అతగాడు చెప్పిన కారణానికి విస్తుపోయారు. కిక్ లేదని జాబ్ వదిలేసే సీన్ తరహాలో ఈ వ్యక్తి చేసిన పనికి జనాలు అవాక్కవుతున్నారు. ఇక అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.