హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా

h1b visa

హెచ్‌1 బీ అనేది నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ వీసా. అమెరికన్‌ కంపెనీలు విదేశీ నిపుణుల్ని పనిలో పెట్టుకోవడానికి ఉపకరించే మార్గం. దీనికి విపరీతమైన డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా భారతీయ టెకీలు- మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది ఐటీ నిపుణులు దీని కోసం అర్రులు చాస్తుంటారు. 2018లో ఈ వీసా కోసం దరఖాస్తు చేసిన వారి సంఖ్య తొలి రెండు వారాల్లోనే 65 వేల పరిమితిని దాటిందంటే దీనికున్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. హెచ్‌1బీ ద్వారా పౌరసత్వం పొందే అవకాశాలు ఇన్నేళ్లూ లేవు. ఇపుడు తొలిసారిగా ట్రంప్‌ ప్రతిపాదిస్తుండడం విశేషం.

Also read : ముగ్గురు మోడీలతో పోరాడాలని సీఎం చంద్రబాబు పిలుపు..

హెచ్1బీ వీసాల జారీ, పొడిగింపు విషయంలో తొలి రెండేళ్ల పదవీకాలంలో కఠినంగా వ్యవహరించారు ట్రంప్. బతుకుదేరువు కోసం అమెరికా వెళ్లినవారిపై ట్రంప్‌ ఎంత దూకుడుగా వ్యహరించాడో తెలిసిందే. ఆయన మొదటినుండి.. అమెరికా ఫస్ట్.. అనే నినాదంతో ముందుకుసాగుతున్నారు. తాజాగా హెచ్‌-1బీ వీసాలో మార్పులు చేస్తామని చెప్పడం విశేషం. ఈ వీసా విధానంలో మార్పులు తీసుకురావడం వల్ల కేవలం అత్యంత నైపుణ్యం ఉన్నవారు మాత్రమే అమెరికాలోకి అడుగుపెట్టే అవకాశం ఉండనుంది.

దీనివల్ల చిన్నా చితకా.. మామూలు ఉద్యోగాలు… చేసేవారు అమెరికాలో ఉండటానికి కాని, అమెరికాకు వెళ్లడానికి కాని వీలు లేకుండా పోతుంది. అలా చేయడం ద్వారా.. మిగిలిన ఉద్యోగాలను అమెరికన్ పౌరులతో నింపుతారు. ఆ విధంగా ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదానికి న్యాయం చేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయ ఐటీ నిపుణులు, ఇతర ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో చట్టబద్ధంగా శాశ్వతంగా నివసించేందుకు అవసరమైన గ్రీన్‌కార్డు పొందాలంటే ప్రస్తుతం సుమారు పదేళ్లు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది.

బ్యాచిలర్ డిగ్రీ లేదంటే అంతకంటే అధిక చదువులు కలిగిన వారు మాత్రమే ఈ వీసాలకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ట్రంప్ ప్రకటిస్తారు..2018లో అమెరికా ఈ తాత్కాలిక వీసాల జారీపై పరిమితి విధించింది. ఏప్రిల్ చివరికి అమెరికా సుమారు 65,000 హెచ్1-బి వీసాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.