కత్తి ఎక్కడ దాచాడు..దాడిపై ఎన్ఐఏ ఆరా

Srinivas-in-NIA-custody
Srinivas-in-NIA-custody

జగన్ పై దాడి కేసులో విచారణ ముమ్మరం చేసింది ఎన్ఐఏ. ఈ కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ ను శనివారం కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ..ఆదివారం బక్కెనపాలెంలోని పీటూసీ సెంటర్ లో విచారించారు. దాదాపు మూడు గంటల పాటు అతన్ని ప్రశ్నించారు. నిందితుడి తరపు న్యాయవాది సలీం సమక్షంలోనే ఈ విచారణ జరిపింది ఎన్ఐఏ.

అనంతరం శ్రీనివాస్ ను విశాఖ ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లిన ఎన్ఐఏ అధికారుల బృందం దాడిపై ఆరా తీసింది. ఎన్ని గంటల సమయంలో దాడికి పాల్పడింది..కత్తి ఎక్కడ దాచిందనే విషయాలతో పాటు దాడికి ఎలా పాల్పడ్డాడో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేసింది.

ప్రతిపక్ష నేత జగన్ పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను హైదరాబాద్ లోని ఎన్ఐఏ ప్రాంతీయ కార్యాలయంలో విచారించాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకు అవసరమైన ప్రాసెస్ ను పూర్తి చేసి..నిందితుడ్ని హైదరాబాద్ తరలిస్తున్నారు.