జగన్‌పై దాడి కేసులో ఆయన ప్రమేయం ఉంది..అందుకే భయపడుతున్నాడు: కన్నా

attack-ys-jagan-mohan-reddy-vizag-airport-2

కేంద్రం ఇచ్చిన నిధులను సీఎం చంద్రబాబు, లోకేష్ దోచుకుని దాచుకున్నారని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో ఓటు అడిగే హక్కు ఒక్క బీజేపీకే ఉందన్నారు. జగన్‌ పై కోడికత్తి దాడి కేసులో ప్రమేయం ఉంది కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. వాల్మీకి బోయల సమస్యను పరిష్కరించేందుకు ప్రధాని సానుకూలంగా ఉన్నారని అన్నారు కన్నా..

ప్రతి కేంద్ర పథకానికి చంద్రన్న పేరు తగిలించి సీఎం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. ఆంధ్రప్రజలకు ముందున్న ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేననని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మోడీ ప్రవేశపెట్టిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లతో కాపులకు ఎక్కువగా లబ్ది చేకూరుతోందని అన్నారు బీజేపీ ఏపీ కో ఇన్‌ఛార్జీ సునీల్‌ దేవ్‌ధర్‌. ఐదేళ్ల మోడీ పాలన సువర్ణ అక్షరాలతో దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.