బడ్జెట్‌ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష

kcr review meeting on budget

తెలంగాణ బడ్జెట్‌ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖలకు కేటాయించాల్సిన నిధులతో పాటు.. గత ఏడాది కేటాయింపులు, ఖర్చులు, మిగులుపై చర్చించారు. ప్రాధాన్యత ఉన్న శాఖలకు ఎక్కువ కేటాయింపులు జరిగేలా చూడాలని సూచించారు. అలాగే త్వరలో రాష్ట్రానికి 15 ఆర్థిక సంఘం రానున్న నేపథ్యంలో… ఇచ్చే నివేదికను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఆర్థిక సంఘం చర్యలు ఉండాలని కేసీఆర్‌ అన్నారు..

Also read : సంక్రాంతి సెలవులు పిల్లలకు మరపురాని జ్ఞాపకాలు

జనం అవసరాలు గుర్తించలేని కేంద్ర విధానాలపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు అభిప్రాయాలతో రాష్ట్రాల్లో పర్యటిస్తే ఫలితం ఉండదన్నారు. రాష్ట్రాలకు అప్పగించాల్సిన అధికారాలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుందన్న కేసీఆర్‌… ..రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకునే విధంగా కేంద్ర విధానాలు ఉండకూడదన్నారు. రాష్ట్రాల అభివృద్ధినే ప్రామాణికంగా కేంద్రం భావించాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సి న వాటాల్లో వివక్ష ఉండటం దురదృష్టకరమన్నారు. వివక్షాపూరిత వైఖరితో కేంద్రం రాష్ట్రాలకు అగౌరవ పరుస్తోందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు కేసీఆర్‌.

ఆర్ధిక విధానాల అమలు తీరులో గుణాత్మక మార్పులు లేక ప్రజలు నిరాశకు గురవుతున్నారంటూ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో అభిప్రాయ పడ్డారు సీఎం కేసీఆర్‌. దేశ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచే దిశలో అనుసరించాల్సిన విధానాలపై ఆత్మావలోకనం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సమావేశంలో తెలిపారు.