మంత్రి ఆదినారాయణ రెడ్డికి షాక్.. జగన్ సమక్షంలో..

minister-adinarayana-reddy-key-aid-joins-ysrcp

జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో అడుగడుగునా జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీఎం సీఎం అంటూ నినదించారు. సుదీర్ఘ పాదయాత్ర ముగిడయంతో సొంత నియోజకవర్గానికి చేరుకున్న జగన్‌ మొదట పులివెందుల పట్టణంలో సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్ధనలు చేశారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌తో గండికి బయలుదేరిన జగన్‌కు దారి పొడవునా పార్టీ నేతలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆంజనేయస్వామి గుడికి చేరుకోగానే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన జగన్‌కు తీర్థ ప్రసాదాలను అందచేసి పండితులు ఆశీర్వదించారు..

Also read : నారావారిపల్లెకు సంక్రాంతి కళ..

తరువాత ఇడుపులపాయకు చేరుకొని తండ్రి వైఎస్‌ సమాధి దగ్గర పుష్పగుచ్చాని ఉంచి నివాళులర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇడుపులపాయలోని అతిథి గృహానికి చేరుకొని ఎమ్మెల్యేలను నేతలను కలిశారు. తనకు పాదయాత్రలో మద్దతుగా నిలిచి, ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మరోవైపు పాదయాత్ర తరువాత వైసీపీలో వలసలు కొనసాగాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి వందలాది మంది అనుచరులతో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు సంబేపల్లె మాజీ జెడ్పీటీసీ ఉపేంద్ర రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరుడు చెన్న కేశవరెడ్డి, చెన్నూరు టీడీపీ నేత శివరామి రెడ్డిలో జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు..