ప్రియా ప్రకాశ్‌ పడిపోయింది..ఎలాగంటారా?

Priya-Prakash-with--Vicky-K
Priya-Prakash-with--Vicky-K

ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయింది ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. తాజాగా ప్రియాకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీడియో వైరల్‌గా మారింది ప్రియా వల్ల కాదు. బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌ వల్ల అది ఎలాగంటారా! ఇటీవల ప్రియా, విక్కీ ఇద్దరూ ముంబయిలో కలుసుకున్నారు. ఈ వీడియోలో విక్కీ.. గన్‌ షాట్‌ పేల్చితే దానికి ప్రియా పడిపోయినట్లు ఉన్న దృశ్యం నెటిజన్స్ మనస్పు దోచుకుంది. అదే రోజు ప్రియా..రణ్‌వీర్‌ సింగ్‌ లాంటి బాలీవుడ్ స్టార్‌లను కూడా కలుసుకుంది. త్వరలో ప్రియా వారీయర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రణ్‌వీర్‌ సినిమాలో ఆమె నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది తెలియాల్సివుంది.

//www.instagram.com/embed.js