ప్రముఖ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు..ఆరునెలలుగా..

Rajkumar Hirani accused of sexually abusing
Rajkumar Hirani accused of sexually abusing

ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తున్నాయి. ఆరు నెలలుగా హిరాణీ తనను వేధించడంటూ ఆయన దగ్గర పనిచేసే సహయక దర్శకురాలు పలు ఆరోపణలు చేసింది. సంజయ్ దత్తు జీవితం అధారంగా నిర్మించిన సంజు సినిమాకు ఆమె హిరాణీ దగ్గర సహయక దర్శకురాలుగా పనిచేసింది. ఆ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో హిరాణీ తనను లైంగికంగా వేధించారని ఆమె వెల్లడించింది.

“హిరాణీ బాలీవుడ్‌లో పేరున్న దర్శకుడు కావడంతో ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. తను నా పట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించాడు. అతని వల్ల నా మనస్సు శరీరం రెండు పాడైపోయాయి. వీటిన్నంటిని మౌనంగా భరించాను. ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగం పోతుందని భయంతో తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సి వచ్చింది” అంటూ సినిమా నిర్మాత విధు వినోద్‌ చోప్రాకు పంపిన మెయిల్‌‌లో తన ఆవేదనను వ్యక్తం చేసింది

ఆమె చేసిన ఆరోపణలను హిరాణీ ఖండించారు. ఈ వివాదంపై ఆయన తరపు న్యాయవాది ఆనంద్‌ దేశాయ్‌ మీడియాకు వివరణ ఇచ్చారు. హిరాణీపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.