మంత్రి పదవులకు వీరి పేర్లు పరిశీలిన..

telangana cabinate establish by this month

తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణలో బెర్త్‌ కోసం పోటీ పడే ఆశావహుల లిస్ట్‌ భారీగానే ఉంది. ఇందులో సీనియర్లతో పాటు కొత్తవారు సైతం పోటీ పడుతున్నారు. గ‌తంలో ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా నుండి కేటీఆర్ , ఈటెల రాజేంద‌ర్ మంత్రులుగా ప‌నిచేసారు.. వీరితో పాటు కొప్పుల ఈశ్వ‌ర్ ప్ర‌భుత్వ చీఫ్ విప్ గా ప‌నిచేసారు. కేటీఆర్ ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా నియ‌మించారు.. అయితే ఆయ‌న‌కు బెర్త్ క‌న్ఫామ్ అయిన‌ట్టే ఇత‌ర ఎమ్మెల్యేల్లో ఈటెల రాజేంద‌ర్ కు స్థానం క‌ల్పించ‌క పోతే ప్ర‌జ‌ల్లోకి ఏ సంకేతం పోతుందో అని భావిస్తున్న కేసీఆర్ ఆయ‌న‌కు కూడా క్యాబినేట్ లో స్థానం క‌ల్పించే అవ‌కాశం ఉంది.. ఈయ‌న తో పాటు కొప్పుల ఈశ్వ‌ర్, గంగుల క‌మ‌ళాక‌ర్, స‌తీష్ లు కూడా విస్త‌ర‌ణ‌లో త‌మ బెర్త్ కోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుండి గ‌త ప్ర‌భుత్వంలో క‌డియం శ్రీ‌హ‌రి, చందులాల్ లు మ‌త్రులుగా ప‌నిచేసారు. అయితే ఈ సారి చందులాల్ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు .. మ‌రోవైపు సీనియ‌ర్ నేత క‌డియం శ్రీ‌హ‌రిని ఎంపీ స్థానానికి పోటిచేయించే ఆలోచ‌ణ లో ఉన్నారు కేసీఆర్. దీంతో ఈ జిల్లా నుండి రెండు బెర్తులు ఉంటే రెండు కొత్త‌వారికే రానున్నాయి.

Also read : పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం

ఈ జిల్లా నుండి మ‌త్రులుగా ఆశిస్తున్న వారిలో మొద‌టి స్థానంలో ఉన్నారు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. అసెంబ్లిలో అత్య‌దిక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్య‌క్తి ఎర్ర‌బెల్లి ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కలేదు. దీంతో ఈ సారి ఆయ‌న‌కు బెర్త్ క‌న్ఫాం అంటున్నారు. ఈయ‌న తో పాటు విన‌య భాస్క‌ర్, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేష్ , రెడ్యానాయ‌క్ లలో ఒకరికి అవ‌కాశం ద‌క్క‌నుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుండి గ‌తంలో జూప‌ల్లి కృష్ణారావు, ల‌క్ష్మారెడ్డిల‌కు క్యాబినేట్ అవ‌కాశం ద‌క్కింది. వీరిలో జూప‌ల్లి ఓట‌మి పాలు కాగ ల‌క్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. స‌మీక‌ర‌ణ‌లు మార‌క‌పోతే ల‌క్ష్మారెడ్డి బెర్త్ క‌న్ఫాం కాగ మరో మంత్రి ప‌ద‌వి జిల్లాకు ఇస్తే కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితుడు నిరంజ‌న్ రెడ్డి తో పాటు శ్రీ‌నివాస్ గౌడు పోటీలో ఉన్నారు. ఇక ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా నుండి మంత్రిగా ఉన్న తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ఆ జిల్లా నుండి ఎవ‌రికి బెర్త్ ఇస్తార‌న్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. అయితే ఖ‌మ్మం టౌన్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన పువ్వాడ అజ‌య్ కి ఈ సారి బెర్త్ క‌న్ఫాం అని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా టీడీపీ నుండి ఎన్నికైనా సండ్ర వెంక‌ట వీర‌య్య సైతం టీఆర్ఎస్ లోకి వ‌స్తే బెర్త్ క‌న్ఫాం అంటున్నాయి టీఆర్ఎస్ వ‌ర్గాలు..

ఇక ఉమ్మ‌డి రంగా రెడ్డి జిల్లా నుండి ఊహించ‌ని ఫ‌లితాలు వ‌చ్చాయి టీఆర్ఎస్ కు. ఈ జిల్లా నుండి మెజారిటీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది టీఆర్ఎస్ . దీంతో ఈ జిల్లా నుండి క్యాబినెట్ బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. వీరిలో కాలె యాద‌య్యా, ఎంపీ గా గెలుపొంది ఈ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన మ‌ల్లారెడ్డి , రెండోవ సారి గెలుపొందిన మాధ‌వ‌రం కృష్ణారావు తో పాటు కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న షంబీపూర్ రాజు కూడా క్యాబినేట్ రేసులో ఉన్నారు.

ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో తాజా మాజీ మంత్రి జ‌గ‌దీశ్ర్ రెడ్డి మాత్ర‌మే క్యాబినెట్ లో ఉండ‌గా ఈ సారి క్యాబినేట్ లో బెర్త్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. మంఖ్య‌మంత్రితో పాటు కేటీఆర్ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి , యూవ ఎమ్మెల్యేగా ఉన్న గ్యాద‌రి కిషోర్ తో పాటు మ‌హిళా కోటాలో త‌న‌కు బెర్త్ ఉంటుందని భావిస్తున్నారు అలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత‌.

ఇక హైద‌రాబాద్ జిల్లాలో క్యాబినేట్ లో త‌ల‌సాని రెన్యువ‌ల్ అవుతార‌ని భావిస్తున్నారు.. అయితే ఈయ‌న తో పాటు మాజీ మంత్రి దానం నాగేంద‌ర్ కూడా త‌న‌కు క్యాబినేట్ లో చోటు ఉటుంద‌ని ఆశిస్తున్నారు. ఇక ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సొంత జిల్లా నుండి ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి ఉండ‌గా ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీష్ రావ్ కు క్యాబినేట్ లో ఏ స్థానం ఇస్తారన్న దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. వీరితో పాటు స్పీక‌ర్ త‌న పేరు ప్ర‌తిపాదించ‌క‌ పోతే మ‌హిళా కోట‌లో క‌చ్చితంగా క్యాబినేట్ లో చోటు ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు మెద‌క్ ఎమ్మెల్యే ప‌ద్మాదేవేంధ‌ర్ రెడ్డి.. లేదంటే సోలిపెట రామ‌లింగారెడ్డికి సైతం ఈ సారి క్యాబినేట్ లో చోటు ద‌క్కే అవ‌కాశాలున్నాయంటున్నారు టీఆర్ఎస్ నేత‌లు.

ఇక నిజామాబాద్ జిల్లా లో కూడా సీనియ‌ర్ నేత‌లు త‌మ‌కు క్యాబినేట్ లో బెర్త్ ఉంటుంద‌ని భావిస్తున్నారు. వీరిలో తాజా మాజీ మంత్రి పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ఉన్నారు.. అయితే ఈ సారి స్పీక‌ర్ ప‌ద‌వి ప్ర‌తిపాద‌న‌లో ఈయ‌న పేరే ప్ర‌ముఖంగా వినిపిస్తుంది.. స్పీక‌ర్ గా ఎన్నుకోక పోతే ఈయ‌న‌కు క్యాబినేట్ లో బెర్త్ ఉంటుందా లేదా అనేది ప్ర‌శ్నార్ద‌కంగా ఉంది. ఈయ‌న తో పాటు బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ రెడ్డి, షిండే, గంపా గోవ‌ర్ద‌న్ లు కూడా క్యాబినేట్ బెర్త్ కోసం ఆశిస్తున్నారు…

ఈ సారి టీఆరెస్ పార్టీ నుండి మహిళలు ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పద్మాదేవేందర్ రెడ్డి, రేఖానాయక్ , గొంగిడి సునీత ముగ్గురు క్యాబినేట్ ఆశిస్తున్నారు.. వీరికి ఈసారి క్యాబినెట్ కాక పోయినా క్యాబినేట్ ర్యాంక్ పదవులు ఖాయమని తెలుస్తోంది.. ఛీఫ్ విప్ , స్పీకర్, మంత్రి పదవుల్లో వీరి పేర్లు పరిశీలిస్తున్నట్టు సమాచారం… మొత్తానికి 30 మంది ఎమ్మెల్యేలకు ఈ దఫా క్యాబినెట్ ర్యాంక్ పదవులు దక్కనున్నాయి.. పార్లమెంటరీ రాజ‌కీయ‌ సెక్రటరీలుగా నియ‌మించాలని భావిస్తున్నారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా చాలా మందికి క్యాబినేట్ హోదా ఖాయం అంటున్నాయి తెలంగాన‌ భ‌వ‌న్ వ‌ర్గాలు. అయితే క్యాబినెట్ విస్త‌ర‌ణ ఈ నెల 18నే ఉంటుందా ఫిబ్ర‌వ‌రి లోనే ఈ విస్త‌ర‌ణ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతారా అన్న‌ది సస్పెన్స్ గా ఉంది. యాగాం ఈ నెల 21 నుంచి 24వరకు చేపడుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో క్యాబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉందంటున్నారు గులాబీనేతలు..

ఆరు నెల‌ల ముందుగానే ఎన్నిక‌ల‌కు వెళ్ళిన కేసీఆర్ కు…….. ప్ర‌జ‌లు అథ్యధిక సీట్లతో మ‌రోసారి ప‌ట్టం క‌ట్టారు. 88 సీట్ల‌తో రెండ‌వ సారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ నెల రోజు క్రితం సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఆయ‌తో పాటు హోమంత్రిగా ఎమ్మెల్సీ మ‌హ‌మూద్ అలీని ప్ర‌మాణ స్వీకారం చేసారు. అదే రోజు 5 నుండి 6 మంది మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని భావించినా అంద‌రికీ షాక్ ఇస్తూ కేవలం మ‌హ‌మూద్ అలీ కి మాత్ర‌మే మొద‌టి విడ‌త‌లో అవ‌కాశం ఇచ్చారు కేసీఆర్‌. ప్ర‌మాణ స్వీకారం చేసి నెల రోజులైనా క్యాబినెట్‌ విస్త‌ర‌ణ‌పై ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. మ‌రోవైపు ఈ నెల 17న శాస‌న‌స‌భ స‌మావేశం కాబోతోంది. ఈ స‌మావేశాల్లో ఎమ్మెల్యేలు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఇక కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో ఎన్ఆర్ఐ కోటా ఎమ్మెల్యేగా స్టీఫెన్ స‌న్ ను తిరిగి ఎన్నుకున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాకుండా కార్పోరేష‌న్ ల‌కు చైర్మ‌న్‌ ల నియామ‌కం పైనా పార్టీ నేత‌లు ఎంతో మంది ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ సివిల్ స‌ప్లై శాఖ చైర్మ‌న్ గా సిద్దిపేట‌కు చేందిన‌ మారెడ్డి శ్రీ‌నివాస్ రెడ్డిని నియ‌మించారు. ఇంకా కార్పోరేష‌న్ల చైర్మ‌న్ల నియామ‌కం ఉంటుంద‌ని అంతా భావించినా……ఒక్క‌రితోనే ఆపేసారు. దీంతో త‌మ వంతు ఎప్పుడు వ‌స్తుందోని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆశావాహులు..

మరోవైపు… క్యాబినేట్లో ఎవరికి అవ‌కాశం వ‌స్తుందా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది. అనూహ్య నిర్ణ‌యాల‌కు తీసుకోవ‌డంలో ఆరితేరిన సీఎం కేసీఆర్ క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లోనూ అదే పంథాను పాటిస్తారా లేకా అంచ‌నాల మేర‌కే క్యాబినేట్ విస్తరిస్తారా అన్నది ఎవ్వరూ అంచ‌నా వేయ‌లేక పోతున్నారు. ఇందులో పాత‌వారికీ అవ‌కాశం ఇస్తారా లేదా అన్నది కూడా సస్పెన్స్‌గా మారింది. మొన్నటి ఎన్నికలకు ముందకు అసెంబ్లీ ర‌ద్దు చేసి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఒకేసారి 105 స్థానాల‌కు అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించిన కేసీఆర్…… పాత‌వారికే టికెట్లు ఇచ్చి అంద‌రి అంచ‌నాలను త‌ల‌కిందులు చేశారు. ఇదే త‌ర‌హాలో కేసీఆర్ క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో పాత‌వారికి అవ‌కాశం ఇస్తార‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు సీనియ‌ర్ నేత‌లు. అయితే సీనియ‌ర్ల‌తో పాటు కొత్త‌వారికి కూడా అవ‌కాశం ఉంటుందంటోంది మ‌రో వ‌ర్గం. గ‌త ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప‌నిచేసిన చాలా మందిపై కేసీఆర్ అంత సానుకూలంగా లేరని వారి స్థానంలో కొత్త‌వారికి యువ‌కుల‌కు, మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.

ఇక స్పీక‌ర్ గా ఎవ‌రిని ఎన్నుకుంటారన్న దానిపైనా ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతుతోంది. సీనియర్ల‌కే ఆ స్థానం క‌ట్ట‌బెడుతార‌న్న ఊహ‌గానాలు వ‌స్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావ‌డం లేదు. అయితే పద్మాదేవేందర్ రెడ్డి, పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి, రెడ్యానాయ‌క్ ల‌లో ఎవ‌రినో ఒక‌రినీ స్పీక‌ర్ గా ఎన్నుకుంటారంటున్నాయి టీఆర్ఎస్ వ‌ర్గాలు.

ఈ సారి క్యాబినేట్ లో సీనియర్ జూనియర్ మంత్రులతో క్యాబినెట్ విస్తరణ ఉంటుందని స్పష్టం చేసిన కేసీఆర్ ఎమ్మెల్యేలందరికి టెన్షన్ పెట్టారు. దీంతో అటు మాజీ మంత్రులు..ఇటు కొత్తగా మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. మంచిరోజులు లేకపోవడంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేశారు. ఈనెల 17 పవిత్ర ఉత్తరాయాణ పుణ్యకాలంలో ఏకాదశి శుభ తిదినాడు తొలి శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక క్యాబినెట్ ను పార్లమెంట్ ఎన్నికల ముందు 8 మందితో తర్వాత మరో 8 మందితో క్యాబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. అయితే ఎవరా అధృష్టవంతులు అనేది మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.. తాజా మాజీ మంత్రులతోపాటు..సీనియర్లు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సైతం మంత్రిపదవుల పై ఆశపెట్టుకున్నారు. ఈ నెల 18న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఆరోజు ఉదయమే క్యాబినెట్ విస్తరణ జరిగే అకాశం ఉందంటున్నారు. అయితే దీనిపై అటు కేసీఆర్ గాని ఇటు పార్టీ వ‌ర్గాలు గాని నోరుమెద‌ప‌డం లేదు. క్యాబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగితే అదిలా బాద్ జిల్లా లో తాజా మాజీలు ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి, జోగు రామ‌న్న ఉన్నారు.. వీరికే అవ‌కాశం ఇస్తారా లేదా అన్న‌ది స‌స్పెన్స్ వీరిని క్యాబినేట్ లోకి తీసుకోక పోతే ఈ జిల్లా నుండి ఎన్నికైనా ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన రేఖా నాయ‌క్, ఎస్సీ సామాజిక వ‌ర్గం నుండి సుమ‌న్ క్యాబినెట్ లో చోటు ద‌క్కొచ్చ‌ని భావిస్తున్నారు.