వద్దన్నా కూడా..ఎందుకు వసూలు చేస్తున్నారు

toll-tax
toll-tax

సంక్రాంతి వేళ పిండివంటలతో తెలుగులోగిళ్లు ఘుమఘుమలాడుతుంటాయి. అయితే, ఈ సారి పెరిగిన నిత్యావసర ధరలతో పాటు మారుతున్న లైఫ్ స్టైల్ తో పిండి వంటల ప్రాముఖ్యత తగ్గిపోతోంది. ఇళ్లల్లో సాంప్రదాయ పిండివంటలు మాని స్వీటు షాపుల వెంట, మిఠాయి కార్ఖానాల వెంట పడుతూ, రెడీమేడ్ పిండివంటలకు మొగ్గుచూపుతున్నారు.

అరిశెలు, సున్నుండలు, జంతికలు, నోరూరించే పూతరేకులు పండగ పూట ప్రతి ఇంట్లో చేసుకునే పిండివంటలు. గతంలో ప్రతీ ఇంట్లో వారం, పది రోజులకు సరిపడా పిండివంటలు తయారు చేసి, వచ్చిన చుట్టాలకు కూడా పంపించేవారు. ఇప్పుడు పిండివంటల లిస్ట్ తగ్గిపోయింది. బంధువులు ఇంటికొస్తే ఒకటి, రెండు రకాల పిండి వంటకాలతో సరిపెట్టేస్తున్నారు. ఇంకొందరైతే..పిండి వంటలు చేసే సమయం, ఓపిక లేక రెడీ మేడ్ వంటాలు తెచ్చుకుంటున్నారు.

ధరలు పెరిగిపోవటం..మారుతున్న జీవన శైలి కూడా కారణం అవుతున్నాయి. ఇక కొందరికి పిండి వంటలు చేయటమే తెలియకపోవటంతో.. పిండివంటలు తయారు చేసే దుకాణ దారులకు యమగిరాకీ వచ్చింది. బంధువులు, స్నేహితులు అధికంగా వచ్చే గోదావరి జిల్లాల్లో పిండివంటల తయారీదారులకు బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది.

భీమవరం, అయిభీమవరం, ఆకివీడు, పెదపాడు, కాళ్ల, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు పరిసర ప్రాంతాల్లో పిండి వంటకాల కేంద్రాలు
ఎక్కువగా వెలిశాయి. అయితే, కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా, తమ ఇంట్లో చేసుకున్న టేస్ట్ ఇస్తూ… వినియోగదారుల మన్నన చూరగొంటున్నాయి. నాణ్యత బాగుండటంతో హైదరాబాద్, బెంగుళూరు, ఇతర దేశాలకు కూడా ఎగుమతులు చేసుకుంటున్నారంటున్నారు నిర్వాహకులు..

పండగ రద్దీ కారణంగా టోల్ వసూళ్లు నిలిపివేయాలని ప్రభుత్వాలు ఆదేశించినా..టోల్ గేట్ సిబ్బంది ఖాతరు చేయటం లేదు. కీసర, చిల్లకల్లు, కాజా టోల్ ప్లాజాల దగ్గర టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిలిచ్చినా ఎందుకు ఫీజు వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు ప్రశ్నించినా సిబ్బంది పట్టించుకోవటం లేదు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు.