కామవాంఛ తీర్చమన్నాడు..చివరకు పురుగుల మందు తాగించి..

Rape-attempt-on-teen
Rape-attempt-on-teen

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం నాగలాపురంలో దారుణం చోటుచేసుకుంది. తాను బలవంతం చేసిన విషయం ఎక్కడ బయటకు వస్తుందో అనే భయంతో యువతికి పురుగుల మందు తాగించాడో ఓ కిరాతకుడు. నాగలాపురం గ్రామానికి చెందిన యశోద పోలంలో పనులు చేస్తుండగా శివకుమార్‌ అనే యువకుడు ఆమెపై అత్యాచారనికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని ప్రతిఘటించిన యశోద తప్పించుకోనే యత్నం చేసింది. తాను బలవంతం విషయాన్ని గ్రామంలో అందరికీ చెబుతుందని భయపడిన ఆ యువకుడు ఆమెకు బలవంతంగా పురుగుల మందు తాగించాడు. యశోద అపస్మారక స్ధితిలో పడివున్న విషయాన్ని గమనించిన పక్క పొలాల్లోని రైతులు..కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే వారు యశోదను కర్ణాటకలోని బళ్లారి విమ్స్ కు తరలించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.