నారావారి పల్లెలో భోగి వేడుకలు..సందడి చేసిన లోకేష్, బ్రాహ్మణి

nara-brahmani-with-her-son
nara-brahmani-with-her-son

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో భోగి వేడుకలు అంబరాన్నంటాయి. సీఎం కుటుంబ సభ్యులు భోగీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మరోవైపు కాశిపెంట్ల హెరిటేజ్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో పండగ సందడి నెలకొంది. ప్రతీ యేడు లాగే ఈసారి కూడా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి లోకేష్‌, బ్రహ్మణి భోగీ వేడుకల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామునే భోగీ మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు….

భోగీ వేడుకల్లో మంత్రి దేవాన్ష్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. సంప్రాదాయ పంచె కట్టుతో భోగీ వేడుకల్లో సందడి చేశాడు. లోకేష్‌, నందమూరి రామకృష్ణతో పాటు ఇతర నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

భోగీ వేడుకల అనంతరం తిరుమల శ్రీవారిని నారా లోకేష్‌ దంపతులు, నందమూరి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు.

అటు తిరుపతి సమీపంలో కాశిపెంట్ల హెరిటేజ్‌ ఫెడ్‌ లిమిటెడ్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. హెరిటేజ్‌ ప్రాంగణంలో గంగిరెద్దుల విన్యాసాలు, రంగవల్లులను ఆసక్తిగా తిలకించారు.

అనంతరం హెరిటేజ్లో జరిగిన పలు ప్రారంభోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పాడి రైతులు, ఉద్యోగులతో జరిగిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంగళవారం నారావారి పల్లెలో జరిగే సంబరాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.