భార్య ఇచ్చిన క్రీమ్ ను.. భర్త తన ప్రైవేట్ భాగాల్లో రాసుకోగానే..

jawan-files-complaint-wife-
jawan-files-complaint-wife-

ప్రియుడి మోజులో పడి భర్తను చంపేందుకు ఓ కొత్త పద్దతిని అనుసరించిందో భార్య. ఆర్మీ జవాన్‌గా పనిచేసే ఓ వ్యక్తి సెలవులపై ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తన భార్యతో లైంగిక చర్యలో పాల్గోబోయాడు. కాని.. ఆ భార్య కాసేపు ఆగమంది. ముందుగా ఓ క్రీమ్ ను రాసుకోవాలని కోరింది. ప్రేమగా దానిని అతనికి అందించింది. దాన్ని అతను తన ప్రైవేట్ భాగాల్లో రాసుకోగానే విపరీతంగా నొప్పి కలిగింది. ఆ బాధను తట్టుకోలేకపోయాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ జవాన్‌.. వైద్యుడి దగ్గరకు వెళ్లాడు. ఆ లేపనంలో విషాన్ని కలిపారని.. అందుకే అంత నొప్పి పుట్టిందని చెప్పాడా వైద్యుడు. విషప్రభావం తక్కువగా ఉండడం వల్ల అదృష్టవశాత్తూ ప్రాణహాని తప్పిందన్నాడు. దీంతో ఆ జవాన్ తన భార్యపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతను ఉపయోగించిన క్రీమ్ ను ఇంకా సీజ్ చేయలేదని, దాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపిస్తామన్నారు. ఆ తరువాతే మిగిలిన వివరాలు వెల్లడిస్తామన్నారు. జవాన్‌ భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, ఆమె ప్రియునిగా భావిస్తున్న వ్యక్తి పరారీలో ఉండడంతో.. ఇంకా వారిని అదుపులోకి తీసుకోలేదన్నారు పోలీసులు.