శబరి మకర జ్యోతి దర్శనం కోసం క్లిక్ చేయండి

అయ్యప్ప శబరిగిరుల్లో కాసేపట్లో మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. 6 గంటల 45 నిమిషాలకు భక్తులకు మకర జ్యోతి దర్శనం కలగనుంది. పొన్నాంబలమేడు కొండ మీద కనిపించే మకర జ్యోతిని చూసేందుకు అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా చేరుకున్నారు. జ్యోతి దర్శించుకునేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శబరిమల పరిసర ప్రాంతాలు అయ్యప్ప శరణు ఘోషతోతో మారుమోగుతున్నాయి.

మకర జ్యోతి దర్శనం కోసం ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. గత మూడు నెలలుగా మహిళల ఆలయ ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో….ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మకర జ్యోతి దర్శనం సందర్భంగా గొడవలకు ఎలాంటి ఆస్కారం లేకుండా నిఘా పెంచారు.