26 ఏళ్ల క్రితం కుటుంబ అవసరాల కోసం ఏర్పాటు చేసింది..

chandrababu naidu with nara bhuvaneshwari
chandrababu naidu with nara bhuvaneshwari

తిరుపతి సమీపంలోని కాసిపెంట్ల హెరిటేజ్‌ పుడ్‌ లిమిటెడ్‌లో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు. హెరిటేజ్‌ ఆవరణలో నిర్వహించిన సంక్రాంతి సబరాల్లో పాల్గొన్న చంద్రబాబు…అక్కడ గంగిరెద్దుల ఆటలు, రంగవల్లులను ఆసక్తిగా తిలకించారు.

అనంతరం వెయ్యి ఎంన్‌డీ సామర్థ్యం గల ఎఫ్యులెంట్‌ ట్రీట్‌మెంట్‌ను ప్రారంభించారు చంద్రబాబు. ఆ తరువాత ఉద్యోగులు, పాడిరైతుల కోసం ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెరిటేజ్‌ సంస్థ నూతనంగా ప్రారంభించిన స్పెషల్‌ గీ ప్యాకెట్‌లను సీఎం ప్రారంభించారు.

26 ఏళ్ల క్రితం తన కుటుంబ అవసరాల కోసం ఏర్పాటు చేసిన హెరిటేజ్‌ సంస్థ…నేడు ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు సీఎం చంద్రబాబు.