ఈ హరిదాసుల రూటే సెపరేటు! .. సంక్రాంతి ట్రెండ్ మారిందా?

haridasulu change the tradition in sankranthi festival

నెలగంట పట్టినప్పటినుండీ సంక్రాంతి వేడుకల్లో నెలరోజుల పాటు పల్లెల్లో హరిదాసులు సందడి చేసేవారు. చేతిలో తంబురా, మరొక చేతిలో చిడతలు, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని హరినామ కీర్తనలతో తెల తెల్లవారక ముందే వచ్చే గ్రామాల్లోకి వచ్చేవారు. ట్రెండ్ మార్చిన హరిదాసులు..టూ వీలర్ పై వచ్చి బిక్షాటన చేస్తున్నారు. టేపు రికార్డర్లలో సంకీర్తనలు వినిపిస్తూ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్తున్నారు.

హరీనామ కీర్తనలు ఆలపిస్తూ వచ్చిన బియ్యం, డబ్బులతో జీవనం గడిపేవారు. అయితే..మారుతున్న కాలంలో హరిదాసు కుటుంబాలు కూడా ఉద్యోగాలు, ఇతర పనులు చేసుకుంటున్నారు. దీంతో వలసలు పెరిగిపోయాయి. మిగిలిన కొద్ది మంది హరిదాసులు తమ పరిధిలోని అన్ని గ్రామాల్లోకి త్వరగా వెళ్లి రావడానికి ఇలా మోటార్ బైక్స్ ను వాడక తప్పట్లేదని చింతలపూడి ప్రాంతానికి చెందిన హరిదాసులు అంటున్నారు.

మరోవైపు గంగిరెద్దులతో డూడూ బసవన్నలతో ప్రాచీన ఆటలను ఆడించే సాంప్రదాయం కూడా తగ్గిపోతోంది. పల్లెల్లో మాత్రం అక్కడక్కడా
డూడూ బసవన్నల సందడి కనిపిస్తోంది. ఇక పట్టణాల్లో ఏదైనా వేడుకకు ఆహ్వానిస్తే తప్ప రాని పరిస్థితి ఉంది. తమను గతంలో ఆదరించినట్లు ఈ ఇప్పటి తరం ఆహ్వానించడంలేదని, సాంప్రదాయాన్ని బతికించాలి కాబట్టి ఇంకా గంగిరెద్దులతో తిరుగుతున్నామని పశ్చిమలో బసవన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.