ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంట పెళ్లి సందడి. .ప్రముఖుల హాజరు

Amit-Thackeray-got-engaged-
Amit-Thackeray-got-engaged-

మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఇంట పెళ్ళి సందడి

ఈ నెలాఖరులో జనుగనున్న రాజ్ ఠాక్రే కుమారుడి వివాహం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందని ఆహ్వానం

రాహుల్‌గాంధీ, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ లాంటి ప్రముఖులు హాజరు

మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఈ నెలాఖరులో ఆయన కుమారుడి వివాహం జరగనుంది. ఈ శుభాకార్యానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ లాంటి ప్రముఖులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇంకా వివాహ ఆహ్వానం అందకపోవడం గమనార్హం.ఆ మధ్య ఠాక్రే కూడా ఈ విషయంపై మీడియా ఎదుట ప్రస్తావించారు. కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా అని అప్పట్లో మీడియా రాజ్‌ఠాక్రేను ప్రశ్నించగా.. ‘పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?’ అంటూ బదులిచ్చారు. దీంతో ప్రధాని మోదీని రాజ్‌ఠాక్రే ఆహ్వానిస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.