విషాదం: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత

CINE,MA

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్‌ కె.రంగారావు ఇకలేరు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించిన రంగారావు
పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. నమస్తే అన్న, బొబ్బిలి బుల్లోడు, ఇంద్రధనుస్సు, అలెగ్జాండర్‌,ఉద్యమం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. రంగారావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చివరిగా జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు.
ఆయన అంతక్రియలను కుటుంబ సభ్యులు సోమవారం సాయంత్రం సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో నిర్వహించనున్నారు.

Recommended For You