ఏపీలో కుల రాజకీయాలు చాలా ఎక్కువ-తలసాని

talasani srinivas yadav
talasani srinivas yadav

ఆంధ్రప్రదేశ్ లో యాదవులు సంఘటిత శక్తిగా ఎదగాలని సనత్ నగర్ శాసన సభ్యులు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు.విజయవాడలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సభలో ఆయన పాల్గొన్నారు.విజయవాడ డిప్యూటీ మేయర్ సత్యనారయణ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన యాదవ నాయకులు తలసాని శ్రీనివాస యాదవ్ కు ఘన స్వాగతం పలికారు.తెలంగాణాలో కెసిఆర్ యాదవులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారన్నారు.రాజ్య సభ సీటు కూడా యాదవులకు ఇచ్చి గౌరవించారన్నారు.ఆంధ్రలో మాత్రం ప్రభుత్వం యాదవులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఆంధ్రలో ఉన్న యాదవులు పార్టీలకు అతీతంగా సంఘటితం కావాలని తలసాని శ్రీనివాస యాదవ్ పిలుపునిచ్చారు.జనాభా ప్రాతిపదికన యాదవులకు చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.యాదవులు ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలన్నారు.అవసరమైతే ఆంధ్రా యాదవులకు నాయకత్వం వహిచంటానికి సిద్దంగా ఉన్నాం అన్నారు.యాదవుల సమస్యలు పరిష్కరించటానికి తానెప్పుడూ సిద్దంగా ఉంటానని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామన్నారు తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. విజయవాడలోని దుర్గమ్మని దర్శించుకున్న ఆయన. దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. ఏపీలో జరగనున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ నేతలు టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏ రూపంలో ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్