ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా యువతిని లాక్కెళ్ళిన యువకుడు

young-man-drug-the-young-wo
young-man-drug-the-young-wo
  • గుంటూరు జిల్లా బాపట్లలో కిడ్నాప్‌ కలకలం
  • ఓ యువతిని తీసుకెళ్లేందుకు యువకుడి విఫలయత్నం
  • ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా లాక్కొని వెళ్లిన వైనం
  • వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు అనుమానాలు
  • అప్రమత్తమై గోపీనాథ్‌ అనే యువకుడిని పట్టుకున్న స్థానికులు

గుంటూరు జిల్లా బాపట్లలోని కొల్లపూడి వారి వీధిలో ఓ యువతిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించాడు యువకుడు. గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకొని చితకబాదారు. ఓ యువతి ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా వచ్చిన యువకుడు లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశాడు. గమనించిన యువతి బంధువులు, చుట్టుపక్కల వారు అప్రమత్తమై యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. చాకలిపాలెంకు చెందిన గోపీనాథ్‌, యువతి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. యువతి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు.